Lufthansa : విమానంలో కుదుపులు.. వీడియో డిలీట్ చేయమన్న విమాన సంస్థ

Update: 2023-03-13 03:43 GMT

మార్చి 1న అమెరికాలోని టెనస్సీ మీదుగా లుఫ్తాన్సా విమానం ఎగురుతోంది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో విమానంలో అనుకోకుండా కుదుపులు ఏర్పడ్డాయి. అప్పుడు విమానం 37వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. కుదుపులకు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆహార పదార్ధాలు, పేపర్లు చెల్లాచెదురయ్యాయి. 37వేల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా 4వేల అడుగులకు చేరుకుంది. విమానం కూలిపోతుందన్న సంగతి ప్రయాణికులకు అర్థం అయింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని కంట్రోల్ చేశారు. అత్యవసరంగా వాషింగ్టన్ డీసీలోని డ్యులెస్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.

ఈ ఘటన మార్చి 1న జరుగగా లేటుగా బయటకు వచ్చింది. విమానం కుదుపులకు గురయినప్పుడు ప్రయాణికులు ఫొటోలు వీడియోలు తీశారు. చెల్లాచెదురుగా పడిఉన్న ఆహార పదార్థాలు, పేపర్లను ఫొటోలు, వీడియో తీశారు.  విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమాన సిబ్బంది సదరు ఫొటోలను, వీడియోలను డిలీట్ చేయవలసిందిగా ప్రయాణికులను కోరింది. ఈ విషయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల వ్యక్తగత విషయాలను కంట్రోల్ చేసే అధికారం విమాన సంస్థకు, సిబ్బందికి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు,ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదానికి గల కారణాలను సదరు లుఫ్తాన్సా సంస్థ ఇప్పటికి బయటకు చెప్పలేదు.

Similar News