జర్మనీకి చెందిన ప్రముఖ విమాన సంస్థ లుఫ్తాన్సా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 4 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో డిజిటలైజేషన్ , AI వాడకం పెరగడంతో చాలా ప్రాసెస్ లు ఆటోమేటిక్ గా మారతాయని వెల్లడించింది. దీనివల్ల కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పనులకు.. మానవ వనరులు అవసరంలేదని లుఫ్తాన్సా ఓ ప్రకటనలో పేర్కొంది. 2028-2030 మధ్యకాలానికి 8నుంచి10 శాతం ఆపరేటింగ్ మార్జిన్ సాధించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. అంతర్జాతీయ విమానయాన రంగంలో తీవ్ర పోటీ, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లుఫ్తాన్సా స్పష్టం చేసింది. పైలట్లు, కేబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ వంటి ఆపరేషనల్ పోస్టులతో పోలిస్తే.... అడ్మిన్ స్ట్రేటివ్ పోస్టులే ఎక్కువ ప్రభావితం కానున్నట్లు సమాచారం. జర్మనీకి చెందిన మరో దిగ్గజం బాష్ కూడా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 13 వేల ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.