టర్కీ దేశంలో భారీ పేలుడు సంభవించింది. టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ కు సంబంధించిన ట్యాంక్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ట్యాంక్ లో పేలుడు జరిగేందుకు ఎలాంటి ఆస్కారం ఉందో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.