చైనా హెబీ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది. నర్సింగ్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఓ వార్తా సంస్థ కథనాల ప్రకారం.. మంటలు చెలరేగిన సమయంలో 300 పడకల ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.