హర్మూజ్ మళ్లీ క్లోజ్.. యుద్ధం ఎటువైపు సాగుతుందో..?

Update: 2026-04-09 07:46 GMT

పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. మంగళవారం వరకు ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే రెండు వారాల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ఈ ఈ రెండు వారాల్లోపు శాంతి చర్చలు జరుగుతాయని.. ట్రంప్ ప్రకటించారు. అటు ఇరాన్ కూడా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసింది. కానీ ఈ లోపు ఇజ్రాయెల్ మరో దారుణానికి పాల్పడింది. సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదని.. కాబట్టి దాని మీద దాడి చేసింది. పది నిముషాల్లో వందకు పైగా వైమానిక దాడులు జరిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ దాడుల్లో వందల మంది చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడులతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ సంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ మీద దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ మీద భయంకరంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో అసలు ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందనేది అర్థం కావట్లేదు. యుద్ధం ఆగిపోయింది.. హర్మూజ్ ఓపెన్ అయిందని ప్రపంచం సంతోషించే లోపే.. ఈ చేదు వార్త బయటకు వచ్చింది.

ప్రపంచాన్ని నడిపించే చమురు ఇంధనానికి కొరత రాదని అనుకునేలోపే జలసంధి మళ్లీ క్లోజ్ కావడంతో అందరూ నిరుత్సాహ పడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద దాడులు ఆపొద్దని చూస్తోంది. లెబనాన్ ను వీలైనంత తుడిచివేయాలని చూస్తోంది. ఇదే యుద్ధం కొనసాగింపునకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇరాన్ కూడా టెహ్రాన్ మీద దాడులు మొదలు పెడితే.. సీజ్ ఫైర్ ఒప్పందం గాల్లో కలిసినట్టే అవుతుంది. అదే జరిగితే యుద్ధానికి ముగింపు ఇప్పట్లో పడటం కష్టం అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News