Million Dollar Vax Lottery: వ్యాక్సిన్ వేయించుకుంది కోటీశ్వరురాలు అయిపోయింది.

Million Dollar Vax Lottery: కరోనా ఫస్ట్ డోస్ కోసం ప్రజలు ఎంతగా ఆత్రుతపడ్డారో.. సెకండ్ డోస్ వచ్చేసరికి అలా లేదు.

Update: 2021-11-08 08:30 GMT

Million Dollar Vax Lottery: కరోనా ఫస్ట్ డోస్ కోసం ప్రజలు ఎంతగా ఆత్రుతపడ్డారో.. సెకండ్ డోస్ వచ్చేసరికి ఆ పరిస్థితి అంతా తారుమారు అయ్యింది. కోవిడ్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుండడంతో ప్రజల్లో దానిపై భయం కూడా పూర్తిగా పోయింది. అందుకే సెకండ్ డోస్ వేయించుకోవడానికి ప్రజలు ఎక్కువశాతం ముందుకు రావట్లేదు. ఇది గమనించిన ప్రభుత్వం వారు కాదనలేని ఆఫర్లు ఇస్తోంది.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఉచితంగా ఇస్తామని కొన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతే కాదు.. ఇంకొన్ని దేశాల్లో అయితే బీర్లు, మద్యం కూడా ఫ్రీగా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇలా చేసినా.. కొన్ని దేశాల్లో ప్రజలు దీనికి ముందుకు రాపోవడంతో ఎక్కడికి వెళ్లాలన్నా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేశారు. అది లేకపోతే రేషన్ కట్ చేస్తామని భయపెట్టారు కూడా.

ఆస్ట్రేలియా మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా ఆలోచించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి లాటరీని ఏర్పాటు చేసింది. అది కూడా అక్షరాల 1 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో 7.4 కోట్లు. ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచింది 25 ఏళ్ల జోవాన్నే జూ. కేవలం ఆస్ట్రేలియా ప్రభుత్వమే కాదు ఆ దేశంలోని పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ లాటరీకి డబ్బులను స్పాన్సర్ చేశాయి. ది మిలియన్ డాలర్ వాక్స్ ఏలియన్స్ లాటరీని సొంతం చేసుకున్న జూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.


అందులో సగం డబ్బుతో తన ఫ్యామిలీతో చైనా ట్రిప్‌కు వెళ్లాలని, మిగిలిన డబ్బును తన భవిష్యత్తు కోసం దాచుకుంటానని జూ తెలిపింది. జూతో పాటు మరో 100 మందికి 1000 డాలర్లు విలువ చేసే గిఫ్ట్ కార్డులు కూడా అందించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఎంతైనా ఆస్ట్రేలియా ఇలాంటి ఒక ఐడియాతో వ్యాక్సిన్ రేటును పెంచుకోవడం, దాని ద్వారా ఒక యువతి కోటీశ్వరురాలు అవ్వడం చూసి శభాష్ అంటున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News