పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. పీఎం మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. అమెరికా మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.
భారతదేశ దిగుమతులపై అమెరికా 26% టారిఫ్ విధించడాన్ని తాము ఎదురుదెబ్బగా భావించట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది మిశ్రమ ఫలితమే అని తేల్చి చెప్పాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే ఈ టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని వివరించాయి. మరోవైపు, మన దేశ ఫార్మా ఉత్పత్తులకు టారిఫ్ నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.
ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే
* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%