Mukesh Ambani: అపర కుబేరుడు.. రూ.640 కోట్లతో కొడుక్కి విల్లా..
Mukesh Ambani: సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ కోసం కొన్న ఇల్లు. దుబాయ్‌లోని పామ్ జుమేరాలు అత్యంత విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు అంబానీ.;
Mukesh Ambani: సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ కోసం కొన్న ఇల్లు. దుబాయ్‌లోని పామ్ జుమేరాలు అత్యంత విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు అంబానీ. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు బెల్లెవ్యూ రియల్ ఎస్టేట్‌కు చెందిన కోనార్ మెక్కే తెలిపారు. ఈ ఏడాది దుబాయ్‌లో ప్రాపర్టీ మార్కెట్‌ను బలంగా ప్రారంభించేందుకు ముఖేష్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఈ ఒప్పందం నిదర్శనంగా పేర్కొంటున్నారు.
అయితే ఈ ఒప్పందంపై కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రాపర్టీ ఏజెన్సీ తన అధికారిక యూట్యూబ్ హ్యాండిల్‌లో ఆస్తికి సంబంధించిన వీడియోను కూడా అప్‌లోడ్ చేసింది. వీడియోలోని విల్లాపై ఓ లుక్కేయండి.
1) అందమైన మానవ నిర్మిత ద్వీపం యొక్క ఏరియల్ షాట్‌తో వీడియో ప్రారంభమవుతుంది. పామ్ జుమేరా అనేది ఒక కృత్రిమ ద్వీపం. ఇది సూపర్ రిచ్ కాలనీలు మరియు హోటళ్లకు ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం 2001లో ప్రారంభమైంది. ఇది పామ్ దీవులుగా పిలువబడే పెద్ద ద్వీపాలలో భాగం.
2) తదుపరి షాట్‌లో భవనంలోని విలాసవంతమైన సౌకర్యాలను చూపిస్తుంది.
3) భవనంలో మొత్తం పది బెడ్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, ఇండోర్ మరియు అవుట్‌డోర్ పూల్స్ ఉన్నాయి. విలాసవంతమైన విల్లా ఇటాలియన్ మార్బుల్ మరియు అందమైన అత్యాధునిక కళాఖండాలతో అమర్చబడి ఉంది.
4.) 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పెద్ద మాన్షన్‌ను రాబోయే కాలంలో రిలయన్స్ సంస్థ ద్వారా పునరుద్ధరించబడుతుంది.
5) ఇంటి యజమాని ద్వీపంలోని బీచ్‌లను ఆస్వాదించడానికి ఇంకెక్కడికీ వెళ్లా్ల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ కూడా ఉంది.
6) దీంతో పాటు, రెండంతస్తుల భవనంలో ఏడు స్పా సౌకర్యాలు, బార్ ఉన్నాయి. అత్యాధునిక విలాసవంతమైన సౌకర్యాలు ఎవరినీ ఇంటి నుండి బయటకు రానివ్వవు.
7) ఇంట్లో ఓపెన్ కాన్సెప్ట్ వంటగది కూడా ఉంది, ఇది డైనింగ్ ఏరియాతో అనుసంధానించబడి ఉంది.
8) దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతోంది. ధనవంతుల మొదటి ఎంపికగా ఇది అభివృద్ధి చెందుతోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, డేవిడ్ బెక్హాం కూడా నగరంలో ఆస్తులను కొనుగోలు చేశారు.
9) ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు వీలుగా, దుబాయ్ ప్రభుత్వం దీర్ఘకాలిక 'గోల్డెన్ వీసాలు' కూడా అందిస్తుంది.
10) ఇది అంబానీల యొక్క అత్యంత ఖరీదైన ఆస్తి మాత్రమే కాదు. కుటుంబం ఇతర దేశాలలో తన ఉనికిని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది అనేదానికి ఉదాహరణ కూడా.