Narayana Murthy: అల్లుడి విజయం.. మామగారి ఆనందం..
Narayana Murthy: 42 ఏళ్ల రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు సాధించిన విజయాన్ని చూసి ఆనందిస్తున్నారు.;
Narayana Murthy: 42 ఏళ్ల రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు సాధించిన విజయాన్ని చూసి ఆనందిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు రిషీ. భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మొదటి ప్రధానిగా చరిత్రకెక్కారు.
"మేము అతనిని చూసి గర్విస్తున్నాము'' అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడని మాకు నమ్మకం ఉంది."
రిషి సునక్ తల్లి ఫార్మసిస్ట్, తండ్రి డాక్టర్. ఇంగ్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ఒకటైన వించెస్టర్, ఆపై ఆక్స్‌ఫర్డ్‌లో రిషి స్కూలింగ్ పూర్తి చేశారు. అతను గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ Inc.లో మూడు సంవత్సరాలు, తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుండి MBA పట్టా పొందారు.
అక్కడ చదువుతున్నప్పుడే అతడికి నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయం అయింది. వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
2009లో అక్షత, రిషిల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క ఉన్నారు.