Honeymoon: హనీమూన్‌కు హవాయి ద్వీపం వెళ్లిన కొత్త జంట.. షిప్ మిస్ అవడంతో..

Honeymoon: హవాయి ద్వీపానికి విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో హనీమూన్‌కు వెళ్లింది ఓ కొత్త జంట. అయితే షిప్ యాజమాన్యం వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

Update: 2023-03-06 05:43 GMT

Honeymoon: హవాయి ద్వీపానికి విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో హనీమూన్‌కు వెళ్లింది ఓ కొత్త జంట. అయితే షిప్ యాజమాన్యం వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.దాంతో ఆ జంట ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని షిప్ యాజమాన్యంపై కేసు పెట్టింది. ఇటీవల వివాహమైన జంట హవాయిలో హనీమూన్ గడపడానికి వెళ్లింది. హవాయి దీవిలోని ఓ ప్రాంతంలో ఓడలో ఉన్న వారందరినీ దింపిన ఓడ యాజమాన్యం.. ఓడ గంటకు పైగా ఆగుతుందని, ఆ లోపు ఆ ప్రాంతమంతా చూసి తిరిగి రావచ్చని చెప్పింది. కాలిఫోర్నియాకు చెందిన అలెగ్జాండర్ బర్కిల్, ఎలిజబెత్ వెబ్‌స్టర్ దంపతులు అక్కడి దృశ్యాలను ఆస్వాదించేందుకు దీవిలో దిగారు. ఆ ప్రాంతంలోని అందాలను ఆస్వాదిస్తూ సమయాన్ని మర్చిపోయారు. సమయం మించిపోయిందని తెలియక ఆనందంగా ఈత కొట్టారు.

ఈ సమయంలో తాము వచ్చిన ఓడ వెళ్లిపోయిందని తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే సముద్రంలోకి ఈదుకుంటూ ఓడను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఓడ కదులుతున్న దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు. కొన్ని సంకేతాలను పంపిన ఓడ కెప్టెన్లకు ఈ జంట కనిపించలేదు. ఓడలో ఎంత మంది వచ్చారు.. వారంతా తిరిగి వచ్చారా లేదా అనే విషయాలను గమనింకుండానే ఓడను నడిపే సిబ్బంది వారిని వదిలి వెళ్లింది. వచ్చీ రాని ఈతతో ఏదో విధంగాదంపతులు ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక నివాసితులు ఒడ్డుకు చేరుకున్న దంపతులను ఆదుకున్నారు. వారికి ఆహారం, నీరు అందించారు. ఆ తర్వాత షిప్ మేనేజ్‌మెంట్‌కి ఫోన్ చేయగా, ఓడ వారిద్దరినీ ద్వీపంలో వదిలేసిందని తెలిసింది. వారి కోసం మరొక పడవ ఏర్పాటు చేశారు. తమను అసౌకర్యానికి గురిచేసిన షిప్పింగ్ కంపెనీపై దంపతులు దావా వేశారు.

వారికి తగిన పరిహారం చెల్లించాలని దంపతుల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రస్తుతం ఈ కేసు కాలిఫోర్నియా కోర్టులో పెండింగ్‌లో ఉంది. హనీమూన్‌లో అద్భుతమైన అనుభూతిని పొందేందుకు హవాయి ద్వీపానికి వెళ్లామని, అయితే ఇలాంటి సంఘటన ఎదురవుతుందని ఊహించలేదని ఇది చాలా భయంకరమైన అనుభవమని అన్నారు. మేము బతుకుతామని అనుకోలేదు.. ఈత కొట్టినప్పుడు నా భార్య చాలా అలసిపోయిందని బర్కల్ అన్నారు. పరిహారంగా ఈ ట్రావెల్‌ ఏజెన్సీ తమకు తగిన మూల్యం చెల్లించాలని పేర్కొన్నారు. జంట తరపు న్యాయవాది 5మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40కోట్లు) చెల్లించాలని ట్రావెల్ ఏజెన్సీకి నోటిసులు జారీ చేసింది. 

Similar News