New Electric Car : చైనాలో కొత్త ఎలక్ట్రిక్ కారు.. 668 కి.మీ. నాన్ స్టాప్

Update: 2024-03-13 06:50 GMT

షావోమీ కంపెనీ (Xiaomi Company) బీజింగ్ లో సరికొత్త క్రేజీ ఎలక్ట్రిక్ కారు మోడల్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఎస్‌యూ7 గా (SU7) వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సెడాన్ కారులో ఉన్న ఓఎస్... అన్ని ప్రముఖ ఫోన్లతో లింక్ అవుతుందని తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

'సెల్‌-టు-బాడీ' టెక్నాలజీతో ఈ కారును డెవలప్ చేశారు. టాప్ బ్యాటరీ కంపెనీలు 'కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ', బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో యూజ్ చేశారు. ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఎస్‌యూ 7 మోడల్.. 5.28 సెకన్లలో 0-100 kmph వేగాన్ని క్యాచ్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం గంటకు 210 కి.మీ. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. అటు ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 265 కి.మీ.

Tags:    

Similar News