Goodbye Hug: మూడు నిమిషాలకు మించి కౌగలించుకోవద్దు..

డ్యునెడిన్ విమానాశ్రయంలో కొత్త నిబంధన;

Update: 2024-10-21 03:00 GMT

ఆప్తులకు ఫేర్‌వెల్ ఇస్తూ ఇచ్చే ‘గుడ్‌బై హగ్’ (కౌగిలింత) మూడు నిమిషాలకు మించరాదంటూ న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ విమానాశ్రయం డ్రాప్ అఫ్ ఏరియాలో అధికారులు సైన్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరో ప్రయాణికుడు దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది.కౌగిలింతకు టైమ్ లిమిట్ ఏమంటూ కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ కొత్త నిబంధనను ప్రశంసిస్తున్నారు. ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి నిబంధనే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం డ్రాప్ అఫ్ ఏరియా ఇంకా ఉచితమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ సైన్ బోర్డు ఏర్పాటుపై డ్యునెడిన్ విమానాశ్రయ సీఈవో డేనియల్ డి బోనో మాట్లాడుతూ.. విమానాశ్రయాలు ‘ఎమోషనల్ హాట్‌స్పాట్లు’ అని అభివర్ణించారు. 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైంత ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయం కౌగిలింతల వల్ల ఎక్కువమందికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 

అసలు కౌగిలింతకు టైమ్ లిమిట్ ఏమంటూ పెద్దెత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ కొత్త నిబంధనను మెచ్చుకుంటున్నారు కూడా. అంతే కాదండోయ్.. ఇతర విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి నిబంధలనే తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా.. డ్రాప్ అఫ్ ఏరియా ఇంకా ఉచితమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే, ఈ సైన్ బోర్డు ఏర్పాటు విషయమై డ్యునెడిన్ విమానాశ్రయ సీఈవో డేనియల్ డి బోనో మాట్లాడుతూ.. విమానాశ్రయాలు ‘ఎమోషనల్ హాట్‌స్పాట్లు’ అని తెలుపుతూనే.. మరోవైపు 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైంత ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ విడుదలవుతుందని సైన్స్ విషయాన్నీ చెప్పుకొచ్చారు. ఇలా తక్కువ సమయం కౌగిలింతల వల్ల ఎక్కువమందికి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇలాంటి వింత చర్యలు ముందుముందు ఎన్ని చూడాలో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News