New Zealand PM: ప్రధానిగా జెసిండా చివరి ప్రసంగం..
New Zealand PM: జెసిండా ఆర్డెర్న్ మంగళవారం న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా తన చివరి ప్రసంగాన్ని చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.;
New Zealand PM: జెసిండా ఆర్డెర్న్ మంగళవారం న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా తన చివరి ప్రసంగాన్ని చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నేను ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను మీ అందరి ప్రేమ, కరుణ, దయ పొందాను అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, మౌంట్ ఆల్బర్ట్‌కు ఎంపీగా ఉంటానని, అయితే ప్రధాన రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆర్డెర్న్ చెప్పారు. 2017లో న్యూజీలాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు జెసిండాకు 37 సంవత్సరాలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రభుత్వాధినేతగా ప్రధాని పదవిని చేపట్టారు. "సంక్షోభం" సమయంలో దేశాన్ని నడిపించడం చాలా కష్టమని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఒపీనియన్ పోల్స్ ప్రకారం, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న సామాజిక అసమానత కారణంగా జెసిండా ప్రధానిగా ప్రజాదరణ కోల్పోయింది. దేశంలోని లేబర్ పార్టీకి ప్రజల ఆమోదం కూడా తక్కువగా ఉందని పోల్స్ సూచించాయి. కాగా, న్యూజిలాండ్ తదుపరి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్ 14న జరగనున్నాయి.