వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం ‘కైలాస’ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. .అంతేగాక నిత్యానంద బతికే ఉన్నాడని రుజువుగా మార్చి 30న ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార లింక్‌ను తన ప్రకటనకు కైలాస దేశం జత చేసింది. దురుద్దేశపూరితంగానే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తన ప్రకటనలో పేర్కొంది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. నవంబరు 2019లో ఇండియా నుంచి మాయమయ్యారు నిత్యానంద . చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిన తదనంతరం ఈక్వెడార్ సమీపంలో కైలాస అనే తన స్వంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు, దానికి తానే ప్రధానిగా ప్రకటించాడు నిత్యానంద. కాగా, నిత్యానంద ‘కైలాస’ సౌత్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఉంది.