Bangladesh Protest : హ‌సీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్‌కు విముక్తి: నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత

బంగ్లాదేశ్‎కు నాయకత్వం వహించనున్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్;

Update: 2024-08-06 07:00 GMT

బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛ‌ను పొందిన‌ట్లు నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ యూనుస్ తెలిపారు. ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామాతో .. ఫ్రీ కంట్రీగా మారింద‌న్నారు. గ‌త కొన్ని వారాలుగా బంగ్లాలో 30 శాతం రిజ‌ర్వేష‌న్ కు వ్య‌తిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళ‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. షేక్ హ‌సీనా ఉన్న‌న్ని రోజులూ.. ఇది ఆక్ర‌మిత దేశంగానే ఉంటుంద‌ని, ఓ ఆక్ర‌మిత శ‌క్తిలా ఆమె వ్య‌వ‌హ‌రించార‌ని, ఓ నియంత‌లా, ఆర్మీ జ‌న‌ర‌ల్‌గా, అన్నింటినీ ఆధీనంలోకి తీసుకున్నట్లు యూనుస్ ఆరోపించారు. బంగ్లాదేశ్ ప్ర‌జ‌లు ఇప్పుడు విముక్తిని పొందిన‌ట్లు ఫీల‌వుతున్నార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో యూనుస్ పేర్కొన్నారు.

డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ యూనుస్.. సామాజిక వ్యాపార‌వేత్త‌. బ్యాంక‌ర్‌, ఆర్థిక‌వేత్త‌. సివిల్ సొసైటీ లీడ‌ర్‌. 2006లో ఆయ‌న‌కు నోబెల్ పీస్ ప్రైజ్ ద‌క్కింది. గ్రామీణ బ్యాంకును క‌నుగొన్న ఆయ‌న‌కు ఆ అవార్డును అంద‌జేశారు. మైక్రో క్రెడిట్‌, మైక్రోఫైనాన్స్ లాంటి ఆలోచ‌న‌ల‌ను ఆయ‌నే క్రియేట్ చేశారు. అయితే హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ స‌ర్కారు.. డాక్ట‌ర్ యూనుస్‌పై సుమారు 190 కేసులు పెట్టింది. తండ్రి ముజ్‌బిర్ రెహ్మాన్ వార‌స‌త్వాన్ని హ‌సీనా నాశ‌నం చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. హింస‌, విధ్వంసం, అల్ల‌ర్లు.. అన్నీ హ‌సీనాపై కోపంతోనే జ‌రిగిన‌ట్లు తెలిపారు. విధ్వంసం సృష్టించిన యువ‌తే.. భ‌విష్య‌త్తులో దేశాన్ని నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌తిసారీ ఎన్నిక‌ల్లో రిగ్గింగ్‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల‌.. షేక్ హ‌సీనాను రాజ‌కీయంగా ఎదుక్కోవ‌డం కుద‌ర‌లేద‌ని యునుస్ తెలిపారు. 30 శాతం రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వం ఎవ‌ర్నీ ప‌ట్టించుకోలేద‌ని, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండా.. మొండిగా యువ‌త‌ను అణిచివేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌స్తుతం బెయిల్ మీద ఉన్న యూనుస్?. త్వ‌ర‌లోనే బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హించేందుకు డాక్ట‌ర్ యూనుస్ అంగీక‌రించిన‌ట్లు ఓ వీడియో మెసేజ్‌లో కీల‌క విద్యార్థి సంఘం నేత న‌హిద్ ఇస్లామ్ తెలిపారు. తాత్కాలిక ప్ర‌భుత్వ స‌భ్యుల జాబితాను ఇవాళ రిలీజ్ చేయ‌నున్నారు. బంగ్లా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించేందుకు యూనుస్ అంగీక‌రించిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News