North Korea: మానవత్వం మరిచిన ఉత్తరకొరియా.. ఆరు నెలల గర్భిణికి మరణశిక్ష
North Korea: ఉత్తర కొరియా పిల్లలు, గర్భిణీ స్త్రీలను ఉరితీయడం, మానవ ప్రయోగాలు చేయడం, వంటి భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ నివేదించింది.;
North Korea: ఉత్తర కొరియా పిల్లలు, గర్భిణీ స్త్రీలను ఉరితీయడం, మానవ ప్రయోగాలు చేయడం, వంటి భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ నివేదించింది. ఉత్తర కొరియా ఆరు నెలల గర్భిణీ తల్లికి బహిరంగంగా మరణశిక్ష విధించిందని, మానవ ప్రయోగాలు చేసిందని, స్త్రీలను గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేసిందని నివేదిక పేర్కొంది. ఆరు నెలల గర్భిణిని చంపడానికి కారణం ఆమె తన ఇంటిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు దివంగత కిమ్ ఇల్-సంగ్ యొక్క చిత్రపటాన్ని చూపించింది. స్వలింగ సంపర్కులు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించినందుకు మరణశిక్ష విధించిందని మంత్రిత్వ శాఖ నివేదికలో ఉన్నాయి. మాదకద్రవ్యాలు, మతపరమైన కార్యకలాపాల కోసం ఉత్తర కొరియా పౌరులను కూడా ఉరితీసిందని మంత్రిత్వ శాఖ 450 పేజీల నివేదిక వెల్లడించింది. 2017 నుండి 2022 వరకు తమ మాతృభూమి నుండి పారిపోయిన 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుండి ఉత్తర కొరియాలో జరిగిన ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన వివరాలను సేకరించినట్లు రాయిటర్స్ నివేదించింది.