TRUMP: ట్రంప్‌ను భయపెడుతున్న "అక్టోబర్ 10"

అమెరికా అధ్యక్షుడిని వెంటాడుతున్న నోబెల్ శాంతి బహుమతి టెన్షన్

Update: 2025-10-04 06:00 GMT

‘నేను ఏం చేసినా, ఎంత చేసినా వాళ్లు నాకు ఆ పురస్కారం ఇవ్వరు’’.. ఓ సారి ట్రూత్‌లో పోస్ట్‌.. ‘‘ఇప్పటికే నాకు శాంతి పురస్కారం రావాల్సింది. కానీ ఇంకా ఇవ్వలేదు’’.. మరో వ్యాఖ్య... ‘‘నా పేరు ఒబామా అయితే.. 10 సెకన్లలో నోబెల్ వచ్చేదేమో’’.. ఇంకోసారి ట్రంప్ విసుర్లు.. దీనిని బట్టి నోబెల్ శాంతి బహుమతి రావాలని ట్రంప్ ఎంతలా కోరుకుంటున్నారో చెప్పేందుకు.. ఇప్పుడు ట్రంప్‌ను అక్టోబర్ 10 భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఆ రోజు నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. దీంతో ట్రంప్ టెన్షన్‌తో వణికిపోతున్నారని వైట్ హౌస్ వర్గాల టాక్.

‘నో­బె­ల్‌ శాం­తి బహు­మ­తి ’ని అం­దు­కో­వ­డం కోసం అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్‌ ట్రం­ప్‌ ఆరా­ట­ప­డు­తు­న్నా­రు. ప్ర­పంచ ‘శాం­తి­కా­ము­కు­డి’ని అని­పిం­చు­కో­వా­ల­న్న ఆయన కల, ఆకాం­క్ష రో­జు­రో­జు­కీ పె­రు­గు­తుం­దే తప్ప తగ్గ­ట్లే­దు. అం­దు­కో­సం ఆయన మి­త్ర బృం­దం కూడా గట్టి­గా­నే ప్ర­య­త్ని­స్తోం­ది. మరి ట్రం­ప్‌ కల నె­ర­వే­రు­తుం­దో లేదో కానీ ఆయన టె­న్ష­న్ మా­త్రం బాగా పె­రి­గి­పో­యిం­ది. తనకు నో­బె­ల్ బహు­మ­తి ఇవ్వా­లం­టూ కొ­న్నా­ళ్లు­గా డొ­నా­ల్డ్ ట్రం­ప్ అభ్య­ర్థి­స్తు­న్నా­రు. ట్రం­ప్‌ నో­బె­ల్‌ కల ఇప్పు­డు అమె­రి­కా­కు తల­నొ­ప్పి­గా మా­రిం­ది. అవా­ర్డు వస్తుం­దో, రాదో తె­లి­య­దు కానీ, అధ్య­క్షు­డి­గా అన­వ­సర వి­భే­దా­లు, వె­క్కి­రిం­త­ల­ను ఎదు­ర్కో­వా­ల్సి వస్తోం­ది. అక్టో­బ­ర్‌ 10న నో­బె­ల్‌ శాం­తి బహు­మ­తి వి­జే­త­ను ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. ఈనే­ప­థ్యం­లో ట్రం­ప్‌ టె­న్ష­న్‌ పె­రి­గి­పో­యి.. ఏకం­గా ఆ బహు­మ­తి ఇచ్చే కమి­టీ­ని కూడా టా­ర్గె­ట్‌ చేసి వ్యా­ఖ్య­లు చే­శా­రు.

ఇవ్వాల్సిందే అంటున్న పాక్ నేతలు

ట్రం­ప్‌­న­కు నో­బె­ల్‌ ప్రై­జ్‌ దక్కా­ల­ని బల్ల­గు­ద్ది వా­దిం­చే వా­రి­లో పా­క్‌ నే­త­లు ముం­దు­న్నా­రు. ట్రం­ప్‌ ఆరా­టా­న్ని గమ­నిం­చిన పా­క్‌ సై­న్యా­ధి­ప­తి ము­నీ­ర్‌ దా­ని­ని తమకు అను­కూ­లం­గా మలు­చు­కొ­న్నా­రు. అం­త­ర్జా­తీయ ఉగ్ర­వా­దు­ల­ను కడు­పు­లో పె­ట్టి చూ­సు­కొం­టు­న్న తమ దేశం నుం­చి నో­బె­ల్‌ బహు­మ­తి­కి నా­మి­నే­ష­న్‌ పం­పిం­చా­రు. భా­ర­త్‌-పా­క్‌ మధ్య ట్రం­ప్‌ మధ్య­వ­ర్తి­త్వం వహిం­చా­ర­ని కూడా సర్టి­ఫి­కె­ట్‌ ఇచ్చా­రు. ఫలి­తం­గా పా­క్‌­కు అవ­స­ర­మైన ని­ధు­లు, సాయం వం­టి­వి తె­చ్చు­కో­గ­లు­గు­తు­న్నా­రు. ఇటీ­వల శ్వే­త­సౌ­ధం సం­ద­ర్శన వేళ ఇజ్రా­యె­ల్‌ నుం­చి వె­ళ్లిన నో­బె­ల్‌ నా­మి­నే­ష­న్‌ పత్రా­న్ని నె­త­న్యా­హు స్వ­యం­గా ట్రం­ప్‌­న­కు బహూ­క­రిం­చా­రు. శాం­తి బహు­మ­తి­కి సమ­స్య రా­కూ­డ­ద­ని నె­త­న్యా­హు ఖతా­ర్‌­కు ము­క్త­స­రి­గా క్ష­మా­ప­ణ­లు చె­ప్పి.. ట్రం­ప్‌­ను ప్ర­స­న్నం చే­సు­కొ­న్నా­రు.

 ఇవ్వొద్దంటున్న అమెరికన్లు

ఇతర దే­శాల వారు మద్ద­తు ఇవ్వ­డం లే­ద­ని ట్రం­ప్‌ అం­టు­న్నా­రు కానీ స్వ­దే­శం­లో కూడా అను­కూ­లత లేదు. ట్రం­ప్ నో­బె­ల్‌ శాం­తి బహు­మ­తి­కి అర్హు­డు కా­ద­ని 76 శాతం అమె­రి­క­న్లు అను­కుం­టు­న్నా­రు. న్యూ వా­షిం­గ్ట­న్‌ పో­స్ట్‌ - ఇప్సా­స్‌ పో­ల్‌ ఈ వి­ష­యం తె­లి­పిం­ది. కే­వ­లం 22 శాతం ఆయ­న­కు మద్ద­తు ఇచ్చా­రు. రి­ప­బ్లి­క­న్ల­లో­నే 49 శాతం మంది మద్ద­తు ఇవ్వ­గా.. మరో 49 శాతం మంది వ్య­తి­రే­కి­స్తుం­డ­టం గమ­నా­ర్హం. ‘‘నాకు ఇప్పటికే నాలుగైదు సార్లు ఈ పురస్కారం రావాల్సింది. కానీ వాళ్లు నాకు ఇవ్వరు. కేవలం లిబరల్స్‌కు మాత్రమే ఇస్తారు (నోబెల్‌ శాంతి పురస్కారం అందుకున్న డెమోక్రటిక్‌ నేతలను ఉద్దేశిస్తూ) అని ఓసారి ట్రంప్‌ మీడియాతో అన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News