PAK-AFG:పాక్-అఫ్గాన్‌ను కమ్మేసిన యుద్ధ మేఘాలు

భీకర దాడులు చేసుకున్న పాకిస్థాన్-అఫ్గాన్.. 58 మంది పాక్ సైనికులను హతమార్చిన అఫ్గాన్.. పాక్ సైనికులను ఊచకోత కోసిన అప్ఖానిస్థాన్

Update: 2025-10-13 06:45 GMT

దా­యా­ది దే­శా­లైన పా­కి­స్థా­న్ - అఫ్గా­ని­స్థా­న్‌ల సరి­హ­ద్దు ప్రాం­తం మరో­సా­రి రణ­రం­గం­గా మా­రిం­ది. అఫ్గా­ని­స్థా­న్ రా­జ­ధా­ని కా­బూ­ల్‌­లో జరి­గిన వై­మా­నిక దా­డు­ల­కు ప్ర­తీ­కా­రం­గా.. తమ దళా­లు పా­కి­స్థా­న్ సై­ని­కు­ల­పై సా­యుధ ఎదు­రు­దా­డి­కి ది­గా­య­ని అఫ్గా­ని­స్థా­న్ పా­ల­క­వ­ర్గ­మైన తా­లి­బా­న్ సం­చ­లన ప్ర­క­టన చే­సిం­ది. 'డ్యు­రాం­డ్ రేఖ' వెం­బ­డి కు­నా­ర్ నుం­చి హె­ల్మం­డ్ వరకు వి­విధ సరి­హ­ద్దు ప్రాం­తా­ల్లో తీ­వ్ర ఘర్ష­ణ­లు కొ­న­సా­గు­తు­న్నా­య­ని.. దీ­ని­కి పా­కి­స్థా­న్ సా­ర్వ­భౌ­మ­త్వా­న్ని ఉల్లం­ఘిం­చ­డ­మే కా­ర­ణ­మ­ని తా­లి­బా­న్ ఆరో­పిం­చిం­ది. కు­నా­ర్ నుం­డి హె­ల్మం­డ్ వరకు.. దశా­బ్దా­లు­గా యు­ద్ధాల అం­చున ఉన్న ఈ సరి­హ­ద్దు ప్రా­వి­న్సు­ల్లో ఘర్ష­ణ­లు తీ­వ్రం­గా కొ­న­సా­గు­తు­న్నా­య­ని స్థా­నిక అధి­కా­రు­లు ధృ­వీ­క­రిం­చా­రు.

 తాలిబన్ బలగాల కాల్పులు

పా­క్‌ సరి­హ­ద్దుల వెంట తా­లి­బ­న్‌ బల­గా­లు కా­ల్పు­లు జరి­పా­యి. అనం­త­రం అఫ్గా­న్‌ సరి­హ­ద్దు­లు లక్ష్యం­గా పాక్ దా­డు­ల­కు ది­గిం­ది. ఇటీ­వల కా­బూ­ల్‌­పై జరి­గిన వై­మా­నిక దా­డు­ల­కు స్పం­ద­న­గా తాము ప్ర­తీ­కార దా­డు­ల­కు పా­ల్ప­డి­న­ట్లు అఫ్గా­న్‌ పే­ర్కొం­ది.అఫ్గా­ని­స్థా­న్‌ రా­జ­ధా­ని కా­బు­ల్‌­లో తె­హ్రీ­క్‌ ఇ తా­లి­బ­న్‌ పా­కి­స్థా­న్‌ చీ­ఫ్‌ నూర్ వాలి మె­హ్సూ­ద్‌ స్థా­వ­రం లక్ష్యం­గా పా­క్‌ ఫై­ట­ర్‌ జె­ట్లు దాడి చే­సి­న­ట్లు తా­లి­బ­న్ ప్ర­తి­ని­ధి జబీ­హు­ల్లా ము­జా­హి­ద్ ఆరో­పిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ దా­డు­ల­కు ప్ర­తీ­కా­రం­గా ప్ర­స్తు­తం తా­లి­బ­న్‌ దళా­లు సరి­హ­ద్దుల వెం­బ­డి దా­డు­లు చే­ప­ట్టి­న­ట్లు అఫ్గా­న్‌ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. పా­క్‌ బల­గా­లు ని­బం­ధ­న­ల­ను ఉల్లం­ఘి­స్తే తమ సా­యుధ దళా­లు దా­డు­ల­ను మరింత ఉద్ధృ­తం చే­స్తా­య­ని హె­చ్చ­రిం­చా­రు. పా­కి­స్థా­న్ బల­గా­లు చే­సిన వై­మా­నిక దా­డు­ల­కు ప్ర­తీ­కా­రం­గా తూ­ర్పున ఉన్న తా­లి­బా­న్ సరి­హ­ద్దు దళా­లు వి­విధ సరి­హ­ద్దు ప్రాం­తా­ల్లో ఉన్న పా­కి­స్థా­న్ బల­గాల పో­స్టు­ల­పై తీ­వ్ర ఘర్ష­ణ­ల­కు ది­గా­య­ని అఫ్గా­న్ మి­ల­ట­రీ ఒక ప్ర­క­ట­న­లో పే­ర్కొం­ది.

 58 మంది పాక్‌ సైనికులు హతం

అఫ్గా­ని­స్థా­న్‌, పా­కి­స్థా­న్‌ సరి­హ­ద్దు­ల్లో తీ­వ్ర ఘర్ష­ణల వేళ తాము 58 మంది పా­కి­స్థా­నీ సై­ని­కు­ల­ను మట్టు­బె­ట్టా­మ­ని అఫ్గా­ని­స్థా­న్‌ ప్ర­క­టిం­చిం­ది. ఇస్లా­మా­బా­ద్‌ పదే­ప­దే తమ సరి­హ­ద్దుల ఉల్లం­ఘ­న­ల­కు పా­ల్ప­డిన నే­ప­థ్యం­లో ఈమే­ర­కు చర్య­లు తీ­సు­కు­న్న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. అదే వి­ధం­గా.. ఐసి­స్‌ ఉగ్ర­వా­దు­ల­కు ఆశ్ర­యం కల్పిం­చొ­ద్ద­ని పా­కి­స్థా­న్‌­ను హె­చ్చ­రిం­చిం­ది. అప్ఘా­ని­స్థా­న్‌­పై దా­డు­లు చే­సి­న­ట్లు పా­కి­స్థా­న్ ఇప్ప­టి వరకు ప్ర­క­టిం­చు­కో­లే­దు. కానీ టీ­టీ­పీ మి­లి­టెం­ట్ల­కు ఆశ్ర­యం ఇవ్వ­డా­న్ని కా­బూ­ల్ మా­ను­కో­వా­ల­ని పా­కి­స్థా­న్ డి­మాం­డ్ చే­సిం­ది. అఫ్గా­న్ తా­లి­బా­న్‌ భా­వ­జా­లా­న్ని కలి­గి ఉన్న, అఫ్గా­ని­స్థా­న్‌­లో యు­ద్ధ శి­క్షణ పొం­దిన టీ­టీ­పీ మి­లి­టెం­ట్లు.. 2021 నుం­డి తమ వం­ద­లా­ది మంది సై­ని­కు­ల­ను చం­పిం­ద­ని ఇస్లా­మా­బా­ద్ ఆరో­పి­స్తోం­ది.

పాక్ - అఫ్గా­న్ సరి­హ­ద్దుల వెంట నా­లు­గు పా­యిం­ట్ల­లో మొదట చి­న్న ఆయు­ధా­ల­తో, ఆ తర్వాత భారీ ఫి­రం­గు­ల­తో కా­ల్పు­లు జరి­పి­న­ట్లు పా­కి­స్థా­న్‌­లో­ని ఖై­బ­ర్-ఫఖ్తుంం­ఖ్వా ప్రా­వి­న్స్‌­కు చెం­దిన అధి­కా­రి ధ్రు­వీ­క­రిం­చా­రు. పే­లు­డు పదా­ర్థా­ల­ను కలి­గి ఉన్న మూడు అఫ్గా­న్ క్వా­డ్‌­కా­ప్ట­ర్ల­ను కూ­ల్చి­వే­సి­న­ట్లు తె­లి­పా­రు. ఇరు­వై­పుల నుం­చి పో­రా­టం తీ­వ్రం­గా సా­గు­తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. గత కొ­న్ని రో­జు­లు­గా పా­కి­స్థా­న్ పర్వత ప్రాం­తా­ల్లో­ని పా­కి­స్థా­న్ భద్ర­తా దళా­ల­పై టీ­టీ­పీ మి­లి­టెం­ట్లు దా­డు­లు తీ­వ్రం చే­శా­రు. తమ భూ­భా­గా­న్ని ఉప­యో­గిం­చు­కొ­ని పా­కి­స్థా­న్‌­పై దా­డు­లు చే­స్తు­న్నా­ర­ని, ఆ మి­లి­టెం­ట్ల­ను ని­యం­త్రిం­చ­డం­లో అఫ్గా­న్ వి­ఫ­ల­మ­వు­తోం­ద­ని పా­కి­స్థా­న్ ఆరో­పి­స్తోం­ది. అయి­తే పా­కి­స్థా­న్ ఆరో­ప­ణ­ల­ను కా­బూ­ల్‌­లో­ని అధి­కా­రు­లు ఖం­డిం­చా­రు. ఇరు దేశాల ఉద్రిక్తతలతో పౌరులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News