Pakistan : పాకిస్థాన్ లో పేలుడు.. నలుగురు మృతి

Update: 2023-02-26 10:06 GMT


పాకిస్థాన్ లో  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 10మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని మార్కెట్ లో పేలుడు సంభవించింది. బర్డాన్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్లా ఖోసో డాన్ మాట్లాడుతూ, రఖ్నీ మార్కెట్ ప్రాంతంలో సైకిల్ పై అమర్చిన ఇంప్రూవైజ్ ఎక్స్ ఫ్లోజివ్ డివైస్ (IED) పేలినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు.

పేలుడు జరిగిన ప్రాంతంలోని పలు వీడియోలు సంచలనాన్ని నమోదు చేస్తున్నాయి. పేలుడు ప్రాంతం మొత్తం జనం గుమిగూడారు. పరిసరాలన్ని రక్తసిక్తంగా ఉన్నాయి. బాధితులను స్థానికులు, పోలీసులు హాస్పిటల్ కు తరలిస్తున్నారు. బలూచిస్థాన్ సీఎం మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెండో పేలుడును ఖండించారు. నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. బలూజ్ లో ఇటీవల పలు హింసాత్మకఘటనలు చోటుచేసుకున్నాయి. 

Tags:    

Similar News