Pakistan army: పాక్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు

హింసాత్మక ఘటనలు నిరోధించకపోవటనే కారణం

Update: 2023-06-27 03:00 GMT

పాకిస్తాన్ ప్రభుత్వం ముగ్గురు అత్యున్నతస్థాయి అధికారులను పదవుల నుంచి తొలగించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత హింసాత్మక ఘర్షణలు చెలరేగకుండా నిరోధించడంలో విఫలమైనందుకు గానూ లెఫ్టినెంట్ జనరల్‌ సహా ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్టు పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. వీరిలో ముగ్గురు మేజర్ జనరల్‌లు, ఏడుగురు బ్రిగేడియర్‌లు ఉన్నారు.

మొత్తం మీద హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్నందుకు మొత్తం 102 మంది ప్రస్తుతం మిలటరీ కోర్టుల్లో విచారణలో ఉన్నారని మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అర్షద్ షరీఫ్ తెలిపారు. మేజర్ జనరల్స్, బ్రిగేడియర్‌లతో సహా మరో పదిహేను మంది ఆర్మీ అధికారులపై కూడా కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రెండు వేర్వేరు ఆర్మీ విచారణలు పూర్తయిన తర్వాత శిక్షలు విధించినట్లు తెలిపారు.

మే 9 న, ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్, మియాన్ వాలి ఎయిర్ బేస్, ఫైసాలా బాద్ లోని ఐ ఎస్ ఐ భవనంతో సహా 20 కి పైగా సైనిక స్థావరాలను ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు రావాల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం పై కూడా దాడి జరిగింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో కోర్టు విచారణలను అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని సైనిక స్థావరాలు, జిన్నా హౌస్, జనరల్ హెడ్ క్వార్టర్స్ ల భద్రత, గౌరవాలు నిలపడం విఫలమైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు, ఈ నేపథ్యంలోనే ముగ్గురు అధికారులతో సహా లెఫ్ట్ నెంట్ జనరల్ ని కూడా తొలగించారు. ముగ్గురు మేజర్ జనరల్ లు, ఏడుగురు బ్రిగేడియర్లతో సహా ఇతర అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ రాజ్యాంగం చట్ట ప్రకారం శిక్షించబడతారని మేజర్ జనరల్ అర్షద్ షరీఫ్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నిరసనలు పాకిస్తాన్ దేశ చరిత్రలో ఒక మాయనిని మచ్చగా అభివర్ణించారు.

రాజకీయవేత్తగా మారిన మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో పదవీచ్యుతుడయ్యాడు. అప్పటి నుంచి అతను ఉగ్రవాదం, హింసకు ప్రేరేపించడం, దహనకాండ, హత్యాయత్నం వంటివి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక అవినీతి, మోసానికి సంబందించిన కేసులు కూడా కలిపి 150కి పైగా నమోదయ్యాయి.

Tags:    

Similar News