Pakistan : ఫేమస్ అవుదాం అనుకొని అరెస్టు అయ్యాడు
ఫేక్ లవ్ స్టోరీ పోస్ట్ పెట్టి అరెస్టు అయిన యువకుడు;
క్రాస్-బార్డర్ లవ్ స్టోరీలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా పరిచయమైన వ్యక్తుల్ని పెళ్లాడటం ప్రేమికులు దేశాలు కోసం దాటేస్తున్నారు. సీమా-సచిన్, అంజు-నస్రుల్లా వ్యవహారాలు ఇంకా ట్ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇంకా పోలెండ్ మహిళ, బంగ్లాదేశ్ మహిళా అంటూ కూడా రకరకాల స్టోరీలు బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. తనకూ పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి ఓ ఫేక్ లవ్ స్టోరీ పోస్టు పెట్టాడు.అయితే విషయాన్ని ఈ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. చివరికి అది ఫేక్ అని తేలినా కూడా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ కు చెందిన మహమ్మద్ గులాబ్ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఫేస్‌బుక్ లో పరిచయం అయిన పాక్ యువకుడితో కలిసి జీవితాంతం ఉండేందుకు ఒక బ్రిటీష్ మహిళ సలార్‌జైకు వచ్చిందన, ఆవ్యక్తి తన స్నేహితుడే అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. అది వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి చేరింది. రంగం లోకి దిగిన పోలీసులు పోస్టులో పేర్కొన్న చిరునామాకు వెళ్లి పరిశీలించారు. అయితే అతడు చెప్పినట్టు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. పోలీసులు గుర్తించారు. దీంతో కోపాద్రిక్తులైన పోలీసులు. నిందితుడు
ముహమ్మద్ గులాబ్‌పై కేసు నమోదు చేసి, అతడు ఎక్కడున్నాడో ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని పోలీసులు అతి త్వరగా అరెస్టు చేసినప్పటికీ స్థానికుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేక స్పందన వచ్చింది. ఎన్నో ఫేక్ పోస్టులు పెడుతున్న వారు ఎందరిని వదిలేసి ఇతనిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని స్థానికులు వాగ్వివాదానికి దిగారు. ఏది ఏమైనాప్పటికీ అంజు వ్యవహారం తర్వాత పాకిస్తాన్ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అందుకే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.