China -Pak: చైనాకు పాకిస్థాన్ గాడిద చర్మాలు
చైనాపై స్వామి భక్తి చాటుకున్న పాకిస్థాన్... గాడిద చర్మాలు సహా వివిధ వస్తువుల ఎగుమతికి అనుమతి.. కుక్కలు కూడా పంపాలంటున్న చైనా...;
అంతర్జాతీయ వేదికపై తమకు అండగా నిలుస్తున్న చైనాపై పాకిస్థాన్ స్వామి భక్తి చాటుకుంది. గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాక్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేటింగ్ ఆమోదం తెలిపింది.
గాడిద చర్మాలను ప్రాసెసింగ్ కోసం చైనాకు పంపనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి గాడిదలు, కుక్కలను దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తిని ప్రదర్శించినట్లు పాక్ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కుక్కలతో పాటు గాడిదలను కూడా ఎగుమతి చేయాలని చైనా.. పాకిస్థాన్‌ను అభ్యర్థిస్తోందని ఆ దేశ స్టాండింగ్ కమిటీ సభ్యుడు దినేష్ కుమార్ తెలిపారు.