Pakistan: భారత్ పై పాకిస్తాన్ ప్రధాని తీవ్ర ఆరోపణలు

ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి భారత్ కారణం

Update: 2025-11-12 02:00 GMT

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని నిర్వహిస్తుందని ఫరీఫ్ మంగళవారం అన్నారు. భారతదేశ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లో దాడి చేసినప్పటికీ, ఆఫ్ఘాన్ నుంచి పనిచేస్తున్న అదే నెట్వర్క్ వానాలోని అమాయక పిల్లలపై దాడి చేసిందని షరీఫ్ ఆరోపించారు

ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్, ఇటీవల కాలంలో ప్రతీ దాడిని భారత్‌తో ముడిపెడుతోంది. ముఖ్యంగా, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఏ-తాలిబాన్(టీటీపీ) చేస్తున్న దాడులకు ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్దతు ఉందని, తాలిబాన్లను భారత్ ప్రాక్సీలుగా ఉపయోగించుకుంటుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇక బలూచిస్తాన్ ప్రావిన్సులో స్వతంత్రం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కు కూడా భారత్ మద్దతు ఉందని దాయాది దేశం ఆరోపిస్తోంది.

Tags:    

Similar News