నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్‌ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరికాసేపట్లో శ్రీనగర్, ఉదమ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అవుతారు. LoC వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్టార్‌లో ‘ఆపరేషన్ ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్‌కు చెందిన అగ్రశేణి ఫైటర్ జెట్స్‌తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.