Pakistan's Terrorism : పాక్ ఉగ్రవాదమే భారత్ సమస్య.. అమెరికా హాట్ కామెంట్

Update: 2024-07-03 07:22 GMT

అనేక అంశాల్లో భారత్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని అగ్రరాజ్యం తెలిపింది. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. భారత్-పాక్ సంబంధాలపై స్పందిస్తూ... ఉగ్రవాదం ఉన్నంతకాలం శత్రుదేశంతో చర్చలు జరపలేమని భారత్ చెప్పిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మరోసారి గుర్తుచేసింది.

"భారత్-పాక్ మధ్య ఉగ్రవాదం అంశం ప్రధానంగా కొనసాగుతోంది. ఏ దేశమైనా వారి పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటే స్వాగతిస్తాం. కానీ, ఉగ్రవాదం విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. భూమి మీద ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ దేశమైనా ఖండించాల్సిందే” అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.

ఆర్థిక సంబంధాలు, భద్రతా సహకారంతోపాటు పలు రంగాల్లో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు కూడా ఇటీవల భారత్ లో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు.

Tags:    

Similar News