Pilots Fight : ఫ్లైట్‌లో పైలట్ల ఫైట్.. కాలర్లు పట్టుకుని చెంపలు వాయించుకుని..

Pilots Fight : విమానం గాల్లో ఉండగానే పైలట్లు గొడవపడ్డారు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు.

Update: 2022-08-29 10:15 GMT

Pilots Fight: విమానం గాల్లో ఉండగానే పైలట్లు గొడవపడ్డారు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు. ఈ ఘటన ఎయిర్‌ఫ్రాన్స్ విమానంలో చోటు చేసుకుంది. జూన్‌లో జెనీవా-పారిస్ విమానంలో ఘర్షణ పడిన పైలట్లు చెంపలు వాయించుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ఇద్దరు పైలట్లను ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ సస్పెండ్ చేసింది.

సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనను త్వరగా పరిష్కరించాం.. విమానం యధావిధిగా గమ్యస్థానం చేరుకుంది అని తెలిపారు. జెనీవా నుంచి పారిస్‌కు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్, కో-పైలెట్‌ల మధ్య వివాదం ఏర్పడింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకొని కాలర్ పట్టుకున్నారు.

క్యాబిన్ సిబ్బంది కాక్‌పిట్‌లో నుంచి వస్తున్న శబ్ధం విని వారిని సముదాయించారు. అక్కడి నుంచి ఒకర్ని తీసుకొచ్చి ఫ్లైట్ డెక్‌లో కూర్చోబెట్టారు. విమాన ప్రయాణానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం ఏర్పడనందున ఈ ఘటన గురించి బయటకు తెలియజేయలేదు. 

Tags:    

Similar News