వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కజకిస్థాన్, సౌత్ కొరియా ఫ్లైట్ క్రాష్ ఘటనలు మరువక ముందే మరో విమానం కుప్పకూలింది. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలో ప్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే...టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో విమానం కూలిపోయింది. స్థానిక టైం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు యాక్సిడెంట్ జరిగనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు... మరో 18 మందికి పైగా గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.