kitty spencer wedding: 62 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన డయానా మేనకోడలు..

యువరాణి డయానా మేనకోడలు లేడీ కిట్టి స్పెన్సర్ రోమ్‌లో దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త మైఖేల్ లూయిస్‌ను వివాహం చేసుకున్నారు.

Update: 2021-07-29 07:53 GMT

kitty spencer wedding: యువరాణి డయానా మేనకోడలు లేడీ కిట్టి స్పెన్సర్ (30) వారాంతంలో రోమ్‌లో దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త మైఖేల్ లూయిస్ (62) ను వివాహం చేసుకున్నారు. 2018 నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. ఈవివాహం ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో జరిగింది. కిట్టి చార్లెస్ స్పెన్సర్.. దివంగత యువరాణి డయానా తమ్ముడు, విక్టోరియా ఐట్కెన్ కుమార్తె.

వివాహం కోసం, కిట్టి స్పెన్సర్ డోల్స్ & గబ్బానా రూపొందించిన కస్టమ్-మేడ్ వైట్ గౌను ధరించారు. ఈ యువతి తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. కిట్టి స్పెన్సర్ తన పెళ్లి రోజున ఐదు గౌన్లు ధరించారు.



వివాహ సమయంలో కిట్టి వేసుకున్న గౌన్ డిజైన్ చేయడానికి డిజైనర్లకు ఆరు నెలల సమయం పట్టిందట. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు.. ఈ రోజు కోసం నా డ్రెస్ డిజైన్ చేసిన వారికి ధన్యవాదాలు అని కిట్టి తెలిపారు. 

Tags:    

Similar News