వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పరిసరాలు నిరసనలతో హోరెత్తాయి. గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్లివీప్ కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని ఈ ఆందోళన నిర్వహించారు పాలస్తీనా సపోర్టర్స్. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు.
ముందే ఊహించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఆందోళనల్లో పాల్గొన్న వారు చాలా మంది ఎర్రని వస్త్రాలు ధరించి.. ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయెలు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. దాదాపు 2 మైళ్ల పొడవైన బ్యానర్ ను శ్వేత సౌధం వద్ద ప్రదర్శించారు.
ఆపరేషన్ రఫాలో ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటడంపై నిరసనగా దీనిని ప్రదర్శించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి రఫాలోనే పాలస్తీనా వాసులు తలదాచుకుంటున్నారు. తాము ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని వాషింగ్టన్ డీసీ మెట్రో పోలీసులు, సీక్రెట్ సర్వీస్ విభాగం తెలిపింది. ఈ సమయంలో అధ్యక్షుడు, ఆయన సతీమణి భవనంలో లేరు.