Donald Trump : గాజాపై పురోగతి ఆసన్నమైంది: డోనాల్డ్ ట్రంప్

Update: 2025-09-27 05:24 GMT

గాజాపై పురోగతి ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బందీలను విడుదల చేయడానికి, యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మధ్యవర్తులు దగ్గరగా ఉన్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ -హమాస్ మధ్య ఒప్పందం త్వరలోనే పూర్తివుతుందని వైట్ హౌజ్ లో మీడియాతో ట్రంప్ తెలిపారు. ఐతే ఒప్పందం పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఐరాస సమావేశాలు జరుగుతున్న వేళ.. పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం అమెరికా 21-పాయింట్లతో ప్రతిపాదిత ప్రణాళిక రూపొందించింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ , ఈజిప్టు, జోర్డాన్ , తుర్కియే, ఇండోనేసియా, పాకిస్థాన్ దేశాలకు ఆ ప్రణాళికను పంపించింది. ఈ క్రమంలో గాజా ఒప్పందంపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు

Tags:    

Similar News