Queen Elizabeth II: మహరాణికి పెళ్లి కానుక.. నిజాం నవాబు ఇచ్చిన వజ్రాల నెక్లెస్

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ II తన పెళ్లి సందర్భంగా హైదరాబాద్ నిజాం నుండి 300 వజ్రాలు పొదిగిన హారాన్ని బహుమతిగా అందుకున్నారు.;

Update: 2022-09-10 10:00 GMT

Queen Elizabeth II: 1947లో హైదరాబాద్ నిజాం అసఫ్ జా VII నుండి వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్‌ను ఎలిజబెత్ అందుకున్నారు. నచ్చిన బహుమతి ఎంచుకోవాలని నిజాం కోరగా.. ఎలిజబెత్‌ వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్‌ను ఎంచుకున్నారు. ఆమెకున్న అత్యంత విలువైన ఆభరణాల్లో ఇది ఒకటి. దీనిని ఫ్రాన్స్‌కు చెందిన జ్యూయెలరీ సంస్థ రూపొందించింది.

ఈ హారం ధరించిన ఎలిజబెత్ చిత్రాలను జులై 21న రాయల్ ఫ్యామిలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో బ్రిటన్‌ రాణిగా పట్టాభిషేకం అనంతరం దిగిన ఫొటో కూడా ఉంది. ఆ సమయంలో ఆమె మెడలో ఈ వజ్రాల హారం ధరించారు. మనవడి సతీమణి కేట్ మిడిల్టన్‌ కూడా ఈ నెక్లెస్ ధరించి ముచ్చటపడ్డారు. నెక్లెస్‌ను నిజాం అందించిన బహుమతిగా వెల్లడించారు.

'సెప్టెంబర్ 8, 2022' తేదీ బ్రిటన్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్వీన్ ఎలిజబెత్ II ఈ రోజున ఆమె ఐకానిక్ బాల్మోరల్ కాజిల్‌లో కన్నుమూశారు. క్వీన్ ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు, ఆమె మరణ వార్త ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. బ్రిటన్‌ పౌరులు రాణి అస్తమయంతో శోకసంధ్రంలో మునిగిపోయారు.

70 సంవత్సరాలు బ్రిటన్‌ను పాలించిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎలిజబెత్ II మరణ వార్త మొదటిసారిగా ఇంటర్నెట్‌లో వెలువడినప్పుడు, చాలా మంది దానిని బూటకమని కొట్టిపారేశారు. ఈ మధ్య ఇలాంటి నకిలీ వార్తలు వస్తుండడంతో ప్రజలు దానిపై దృష్టి సారించలేకపోయారు.

అయితే, క్వీన్ ఎలిజబెత్ II ఆరోగ్యం క్షీణించడంతో రాజకుటుంబ సభ్యులు ఆమెతో ఉండటానికి హడావిడి చేసినట్లు వార్తలు వెలువడడంతో ప్రతి ఒక్కరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు. ప్రజలు తమ రాణి ఆరోగ్యం గురించి భయాందోళనలకు గురయ్యారు. అంతలోనే రాణి పెద్ద కొడుకు చార్లెస్ తన తల్లి మరణాన్ని ధృవీకరించారు.

Tags:    

Similar News