Russia : ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా.. కీవ్ టార్గెట్‌గా బాంబుల వర్షం..!
Russia : రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు.;
Russia : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. డాన్‌బాస్ ప్రాంతంలోకి రష్యా బలగాలు దూసుకెళ్లాయి. ఉక్రెయిన్‌లోని 11 కీలక నగరాలపై మిస్సైల్స్‌తో దాడి చేస్తోంది. ఒక్కో నగరాన్ని తన ఆధీనంలోకి దూసుకుంటూ వెళ్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా చుట్టుముట్టిన రష్యన్ ఆర్మీ.. ముప్పేట దాడికి దిగింది. సైనిక చర్య ఆపేయాలన్న ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని పుతిన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు.
పైగా ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు విడిచిపెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అల్టిమేట్టం ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చి తీరతామని పుతిన్ డైరెక్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. రష్యాపై దాడికి సిద్ధమంటూ అమెరికా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఉక్రెయిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాపై.. నాటో దళాలతో కలిసి మిలటరీ యాక్షన్ తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు అమెరికా హెచ్చరికలకు ఏమాత్రం బెదరడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్‌పై తాము యుద్ధం మొదలుపెట్టామని, జోక్యం చేసుకునే వాళ్లపైనా ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.