Russians Flee For Thailand: యుద్ధంతో సంబంధం లేదు... థాయ్ లాండ్ చిల్ అవుదాం....
థాయ్ లాండ్ కు వలసపోతున్న రష్యా వాసులు; అక్కడే స్థిర నివాశం ఏర్పరచుకుంటోన్న యువకులు;
ఉక్రెయిన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యా పౌరులు తమ దేశాన్ని విడిచి వలసపోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా వేలకొద్దీ రష్యా దేశస్థులు థాయ్ లాండ్ కు వలస పోతున్న ఘటనలు ఎక్కువ అయ్యయి. థాయ్ లాండ్ లోని ఫుకెట్ కు రష్యా టూరిస్టుల తాకిడి పెరిగింది. భారీ ఎత్తున వస్తున్న పర్యాటకులు ఇప్పట్లో ఇంటికి తిరిగి వెళ్లే సూచనలు కనిపించడంలేదు. నవంబర్ నుంచి సుమారు రెండు లక్షలా 30 వేల మంది థాయ్ లాండ్ లోని ఫుకెట్ కు వలస వెళ్లినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో థాయ్ లాండ్ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. రెసిడెన్షియల్ వీసాలు పొందిన ఎగువ మధ్య తరగతి కుటుంబాలు స్థానికంగా ఇళ్లు కొనుగోలు చేయేడం లేదా దీర్ఘకాలిక లీజ్ తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఇక వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారే కావడం విశేషం. రష్యాలో ఉంటూ యుద్దాన్ని ఆపలేమని, తమ సంపాదన యుద్ధానికి ఉపయోగపడకుండా ఉండాలంటే ఇదే మార్గమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక వలసదారుల్లో యుద్ధంలో పాలుపంచుకునే వయసు గల పౌరులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.