Saudi Arabia : 5033 మంది పాక్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ

Update: 2025-05-17 08:15 GMT

కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరే బియాలో బిచ్చమెత్తుకుంటున్న 5033 మంది పాకిస్తానీయులను ఆ దేశం బహిష్కరించింది. వీరితో పాటు పశ్చిమా సియా దేశాల్లో భిక్షాటన చేస్తున్న 369 మంది ఆయా కంట్రీస్ లో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి మంత్రి మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఎంఎన్ఎ సెహర్ కమ్రాన్ లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా నఖ్వీ సమాధాన మిచ్చారని డాన్ పత్రిక తెలిపింది. ప్రధా నంగా పశ్చిమాసియాలోని మరో ఐదు దేశాలలో భిక్షాటన చేస్తున్నందుకు మరో 369 మందిని అరెస్టు చేసినట్లు నఖ్వీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మంత్రి అందించిన డేటా ప్రకారం జనవరి 2024 నుంచి సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, దుబాయ్ నుంచి భిక్షమెత్తుకుంటున్న 5,402 మంది పాకిస్తానీయులను బహిష్కరించారు. ప్రావీ న్సుల వారీగా చూస్తే ఎక్కువ మంది సింధ్ ప్రాంతానికి చెందిన వారు. సింధ్ ప్రావీన్స్ క్కు చెందిన వారే 2,795 మంది ఉన్నట్టు డాన్ పేర్కొంది. పంజాబ్ ప్రావీన్స్ కు చెందిన వారి సంఖ్య 1,437 మంది అని పేర్కొంది. మిగతా వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలిపింది.

Tags:    

Similar News