మందడం ఈ మధ్య మన దేశంలో సెక్యులరిజం పేరుతో రెచ్చిపోవడం మరీ ఎక్కువ అయిపోయింది. ఆ సెక్యులరిజం ఎలా ఉంది అంటే ఇతర మతాలపై దాడులు జరితితేనే బయటకు వస్తుంది. అదే హిందువుల మీద దాడులు జరిగితే మాత్రం సెక్యులరిస్టులు ఒక్కరు కూడా నోరు మెదపరు. మరి అదేం సెక్యులరిజమో వారే చెప్పాలి. దాన్నే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లాంటి వారు సూడో సెక్యులరిజం అని తేల్చి చెప్పేశారు కూడా. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే మన పక్కనే ఉన్న బంగ్లా దేశ్ లో హిందువుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఇద్దరు హిందువులను కొట్టి చంపేశారు అల్లరి మూకలు. కానీ మన ఇండియాలో మాత్రం ఈ సెక్యులరిస్టులు నోరు మెదపట్లేదు. వాస్తవానికి సెక్యులరిజం అంటే ఏ మతానికి చెందిన వారిపై దాడులు జరిగినా సరే ఖండించాలి.
దాన్నే నిజమైన లౌకికవాదం అంటారు. కానీ లౌకిక వాదం అంటే అన్ని మతాల పట్ల ఇలాగే స్పందించాలి. మతం అనే విషయాన్ని పక్కన పెట్టి సాటి మనిషిగా ప్రతి దాడిని ఖండించాలి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో దీపూ చంద్రదాస్ తో పాటు మరో వ్యక్తిని అత్యంత క్రూరంగా చంపేస్తే ఈ సెక్యులరిస్టులు మాత్రం నోరు మెదపట్లేదు. ఏం ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు. ఇదేం లౌకిక వాదం అని ప్రశ్నిస్తున్నారు సామాన్య జనాలు. దేశంలో ఎక్కడేం జరిగినా నోరు మెదిపే వీరు.. పక్క దేశంలో ఇంతటి దారుణాలు జరుగుతుంటే వీరికి ఎందుకు కనిపించట్లేదో వారికే తెలియాలి.
లౌకిక వాదం ముసుగులో ఒక వర్గంపై దాడి జరిగినప్పుడే స్పందిస్తాం.. మిగతా వారిపై దాడులు జరిగితే స్పందించం అంటే ఎలా కుదురుతుంది. బంగ్లాదేశ్ లో యూనస్ ప్రభుత్వం హిందువుల మీద దాడులను కంట్రోల్ చేయలేకపోతోంది. దీనిపై ప్రతిపక్షాలు ఎంతగా ఫైర్ అవుతున్నా సరే యూనస్ ప్రభుత్వం మాత్రం పైకి మాత్రమే చర్యలు తీసుకుంటాం అంటోంది. కానీ దాడులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనిపై భారత్ కూడా సీరియస్ గానే స్పందించింది. హిందువుల మీద దాడులను ఖండించింది. దీన్ని కంట్రోల్ చేయాలని సూచించింది. ఈ దాడులు ఎప్పుడు ఆగుతాయో వేచి చూడాలి.