అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కు ఎదురు దెబ్బతగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యూయార్క్ జడ్జి తిరస్కరించారు. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ కేసు ప్రభావం చూపుతుందన్న ట్రంప్ లీగల్ టీం వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఖరారు కాలేదు. . ట్రంప్‌పై ఉన్న నేరారోపణలు, భాగమైన తీరు పూర్తిగా అనధికారం, ఇందుకు ప్రెసిడెన్షియల్ ఇమ్యునిటీ ద్వారా రక్షణ పొందలేరని తెలిపారు. విచారణ సమయంలో ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ ఫామ్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు, వైట్ హౌస్ సహాయకుల సాక్ష్యం వంటి కొన్ని ఆధారాలను అనుమతించకూడదని ట్రంప్ న్యాయవాదులు వాదించారు. అయితే అధికారిక విధులకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, అది కేసు దృష్టిని మార్చలేదని న్యాయమూర్తి మర్చన్ అన్నారు. బిజినెస్ రికార్డులను తప్పుదోవ పట్టించినందుకు ట్రంప్ ఈ కేసు ఎదుర్కొంటున్నారు.