Shooting at Chinese New Year : అమెరికాలో కాల్పులు.. 9మంది మృతి

Update: 2023-01-22 11:10 GMT


అమెరికాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం... శనివారం రాత్రి 10 గంటలకు కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ లో చైనా దేశస్తులు లూనార్ న్యూ ఇయర్ వేడుకను జరుపుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి తన మెషిన్ గన్ తో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగుడు పారిపోయాడు.



ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్ వాన్ చాయ్ అనే వ్యక్తి బార్బెక్యూ నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా కొందరు వచ్చి తన రెస్టారెంట్ డోర్ ను మూసివేశారని చెప్పాడు. బయట ఓ వ్యక్తి తన మిషన్ గన్ తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు తెలిపాడు. అతని వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలిస్తున్నారు.  

Tags:    

Similar News