South African: బంగారు గనిలో చిక్కుకున్న 4000 మంది చిన్నారులు..ప్రభుత్వం ఏమన్నాదంటే
బయటకొస్తే.. అరెస్టు తప్పదు;
అక్రమ మైనింగ్‌కు పాల్పడిన 4 వేల మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. గనిలో ఉండిపోయిన వారిని కాపాడేందుకు ససేమిరా అంటోంది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసివేసి నిత్యావసరాలను అందించకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
దేశంలోని వాయువ్య ప్రాంతంలో మూసివేసిన బంగారు గనిలోకి దాదాపు 4 వేల మంది మైనర్లు అక్రమంగా ప్రవేశించారు. అందులో మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశతో గనిలోకి భారీగా వెళ్లినట్టు కథనాలు పేర్కొన్నాయి. అలా వెళ్లిన వారంతా అందులోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యవసరాలను అందించకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ‘క్లోజ్‌ది హోల్’ ఆపరేషన్‌ను చేపట్టింది. అందుకు ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరించింది. ‘‘లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్న ముగ్గురు వ్యక్తుల నుంచి మాకు సమాచారం అందింది. దాదాపు 4 వేల మంది మైనర్లు గని లోపల ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వివిధ గనుల వద్ద వందల సంఖ్యలో మైనర్లు కనిపించారు. అందులో గడిపిన వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యారు. బయటకి వచ్చే వారిని అరెస్టు చేసేందుకు అధిక సంఖ్యలో సిబ్బందిని పోలీసు యంత్రాంగం మోహరించింది’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
‘‘అక్రమంగా గనిలోకి ప్రవేశించిన మైనర్లకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదు. నేరస్థులను కాపాడేందుకు సిద్ధంగా లేదు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఈ చర్యలు తప్పవు.’’ అని కేబినెట్ మంత్రి ఒకరు పేర్కొన్నారు.