Space Weapons : అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా -రష్యా మాటల యుద్ధం

Update: 2024-05-22 06:31 GMT

అంతరిక్షంలో ఆయుధాల వాడకంపై అమెరికా, రష్యాల మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. వాషింగ్టన్ పై మరోసారి మాస్కో తీవ్ర ఆరోపణలు చేసింది. అంతరిక్షంలో ఆయుధాలు ఉంచాలని అమెరికా భావించిందని ఆరోపించింది. ఐక్యరాజ్య సమితిలో తమ తీర్మానాన్ని అమెరికా వీటోతో అడ్డుకున్న నేపథ్యంలో ఘాటుగా స్పందించింది రష్యా.

బాహ్య అంతరిక్షంలో ఆయుధాలను ఉంచడం, సైనిక ఘర్షణకు వేదికగా మార్చడమే లక్ష్యంగా ఉన్నాయని మరోసారి నిరూపించారని రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జకరోవా ఆరోపించారు. అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసకర ఆయుధాన్ని రష్యా రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అగ్రరాజ్యం గతంలోనే ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే గత వారం మాస్కో ఓ ఉపగ్రహాన్ని పంపించిందని.. అది ఆ ఆయుధమేనని తెలిపింది. అవి నిరాధార ఆరోపణలని తోసిపుచ్చిన రష్యా.. అటువంటి వ్యవస్థ తమ వద్ద లేదని తెలిపింది.

అమెరికా వద్దే అటువంటి ఆయుధాలు ఉన్నా యంటూ రష్యా దీటుగా స్పందించింది. ఈ పరిస్థితుల్లోనే అంతరిక్షంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక తీర్మానాలను యూఎన్ఓ భద్రతా మండలిలో ఈ రెండు దేశాలు ప్రతిపాదించాయి. అమెరికా తీర్మానాన్ని చైనా మద్దతుతో రష్యా ఇటీవల అడ్డుకుంది. మాస్కో ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వీటో చేశాయి.

Tags:    

Similar News