Spectacular Sky Event : ఆకాశంలో అద్భుతం.. ఒకేరోజు సూపర్ మూన్, చంద్రగ్రహణం

Update: 2024-09-18 07:17 GMT

రాత్రి వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. బుధవారం నాడు. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇదే రోజున సూపర్ మూన్ గా చంద్రుడు కనిపించనున్నాడు. ఈ గ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం లేదు.

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయం లో ఏర్పడి.. 10.17 గంటలకు ముగిసింది. గ్రహణం మొత్తం 4 గంటల 6 నిమిషాల పాటు కొనసాగనున్నది. ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. మరో వైపు చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించనున్నాడు. దీన్నే సూపర్ మూన్ గా పిలుస్తుంటారు.

ఈ సూపర్ మూన్ ను హార్వెస్ట్ మూన్ గా కూడా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపించనున్నది.

Tags:    

Similar News