Spiritual Leader Aga Khan : ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత

Update: 2025-02-05 12:00 GMT

బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్(88) కన్నుమూశారు. పోర్చుగల్ లోని లిస్బన్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ ట్విట్టర్వేదికగా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 1936లో స్విట్జర్లాండ్లో జన్మించిన ఆగాఖాన్.. 1957లోనే ఇమామ్ గా బాధ్యతలు స్వీకరించారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముఖంగా నిర్వహించే రేసు గుర్రాల్లో నూ పాల్గొనేవారు.ఆగా ఖాన్కు హైదరాబాద్లో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూ ర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం, దాతృత్వం సేవలను అందించారు. 1967లో ఆగాఖాన్ డె వలప్మెంట్ నెట్వర్క్ను స్థాపించి.. ప్రపంచం లో వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేశారు. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూష ణ్ తో సత్కరించింది. ఆగా ఖాన్ కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Tags:    

Similar News