Laurene Powell: కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
పలు అలర్జీతో ఇబ్బంది పడుతున్న లారెన్ పావెల్..;
దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకి హాజరయ్యారు. అయితే, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆంమె అలెర్జీతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గంగా నదిలో పవిత్ర స్నానం చేసే ఆచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద గిరి మంగళవారం మాట్లాడుతూ.. ఆమె పవిత్రస్నానంలో పాల్గొంటారని, శిబిర్‌లో విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. ఆమెకు కొన్ని అలెర్జీలు ఉన్నాయి. ‘‘ఆమె ఎప్పుడూ ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లలేదు. ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. పూజ సమయంలో ఆమె మాతోనే ఉంటుంది’’ అని అతను చెప్పాడు.
144 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయికను గుర్తు చేసే ఈ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు లారెన్ పావెల్ సోమవారం ప్రయాగ్‌రాజ్ వచ్చారు. ఆధ్యాత్మక గురువులు ఆమెకు ‘కమల’గా పేరు పెట్టారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ కార్యక్రమానికి హాజరుకావడానికి ముందు, ఆమె జనవరి 15 వరకు నిరంజిని అఖారా శిబిరంలో కుంభ్ టెంట్ నగరంలో ఉంటారు.
మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నాన సమయంలో, గంగా, యమునా మరియు ఆధ్యాత్మిక సరస్వతి నదుల సంగమ స్థానం అయిన త్రివేణి సంగమంలో కనీసం 3-4 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో ఒకరి తర్వాత ఒకరు పవిత్ర స్నానాలు ఆచరించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళ జరుగుతుంది.