ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వేళ ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ 500 యూఎస్ స్టాక్ మార్కెట్లో 2008 తర్వాత భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఎస్ అండ్ పీ 500 9.5శాతం పెరుగుదల నమోదు చేయగా, నాస్ డాక్ ఒక్కరోజులోనే 12.2శాత లాభ పడింది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలైన విషయం తెలిసిందే. దీనిపై ఇంటా బయట వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిన్న తన నిర్ణయాన్ని సమీక్షించిన ట్రంప్, చైనా మినహా ఇతర అన్ని దేశాలపై విధించిన టారిఫ్స్ 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిం చారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన నష్టాల్లో ఉన్న మార్కట్ కు ఉపశమనం కలిగించింది. ఆసియా మార్కెట్లు కూడా భారీగా లాభపొందా యి. జపాన్ నిక్కీ 2000 పాయింట్లకు పైగా లా భపొందగా, తైవాన్ 9.2 శాతం వృద్ధి నమోదు చేసింది. మహవీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్లకు ఇవాళ సెలవు ప్రకటించా రు. చైనా, కెనడా దేశాలపై మాత్రం ట్రంప్ ప్రతీ కార సుంకాలు కొనసాగుతున్నాయి.