అంతరిక్షంలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి రావడానికి మరింత టైం పట్టనుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం 2025 ఫిబ్రవరిలో తిరిగి రావడం లేదనీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమె తిరుగు ప్రయాణం 2025 మార్చిలో గానీ, ఏప్రిల్లో గానీ జరగవచ్చని నాసా అధికారులు తెలిపారు. ఆమె సురక్షితంగానే ఉన్నారనీ, ఆమెను తీసుకుని వెళ్ళిన బోయింగ్ స్టార్ లైనర్ తెలియజేసింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారనీ, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ ద్వారా భూతలానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.