Suicide Machine : సూసైడ్‌ మెషిన్‌.. నొప్పి తెలియకుండా నిమిషంలో ప్రాణం తీసేస్తుంది..!

Suicide Machine : అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత మంది కారుణ్య మరణాలకు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటాం.

Update: 2021-12-08 04:01 GMT

Suicide Machine : అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత మంది కారుణ్య మరణాలకు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటాం. ఐతే దీనిపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. కానీ కొన్ని దేశాలు అనారోగ్యం బారిన పడి, చావు కోసం ఎదురుచూసే వారి కారుణ్య మరణానికి అనుమతిస్తుంటాయి. అలాంటి వారి కోసమే ఇప్పుడు సూసైడ్‌ మెషిన్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈ మెషిన్‌కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం పర్మిషన్‌ కూడా ఇచ్చేసింది. నొప్పి తెలియకుండా నిమిషంలో వ్యవధిలో ప్రాణాలు తీసేస్తుంది ఈ మెషిన్‌. శవపేటిక ఆకారంలో ఉండే దీన్ని సార్కో అని కూడా పిలుస్తారు. హైపోక్సియా..హైపోకాప్నియా సర్కిల్ సూత్రంపై ఆధారపడి ఈ మెషిల్ పని చేస్తుంది. అటే ఇందులో మనిషి పడుకోగానే....క్రమంగా ఆక్సిజన్‌ లెవల్స్ తగ్గించి...నైట్రోజన్‌ను పంపిస్తారు. దీంతో బాధితుడి శరీర కణాలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోతుంది.

రక్తంలో కార్భన్‌ డై ఆక్సైడ్‌ నిల్వలు పెరిగి బాధితుడి మరణానికి కారణమవుతుంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ మరణం కోసం ఎదురు చూసే వారికి ఇలాంటి యంత్రాలను వాడాలని స్విట్జర్లాండ్ చట్టాలు చెప్తున్నాయి. కారుణ్య మరణం కోరుకునేవారు కోర్టు, ప్రభుత్వం అనుమతితో పాటు డాక్టర్‌ సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరి తీసుకోవాలి. ఈ మెషిన్‌ను డాక్టర్‌ నిట్స్కే తయారు చేశారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుంటే వచ్చే ఏడాది నాటికి స్విట్జర్లాండ్‌లో ఈ మెషిన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.

Tags:    

Similar News