భారత్ వైపే టెస్లా చూపు
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ మళ్ళీ భారత్ మార్కెట్‌పై ఆసక్తి చూపుతోంది;
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ మళ్ళీ భారత్ మార్కెట్‌పై ఆసక్తి చూపుతోంది. చైనాలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన పలు కంపెనీలు ఇటీవల భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్‌లో భారీ ప్రాజెక్టులను ప్రకటంచాయి. ఈ నేపథ్యంలో టెస్లా కూడా మళ్ళీ భారత మార్కెట్‌పై ఆసక్తి చూపుతోంది. భారత్‌లో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని టెస్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో ప్రవేశించేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేంద్రానికి పలు కండిషన్స్ పెట్టారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో టెస్లా ప్రాజెక్టు పెండింగ్‌లో పడిపోయింది. అమెరికా, చైనాలో తయారైన టెస్లా కార్లను భారత్‌లో అమ్మడం కాదని.. ఇక్కడే తయారీ యూనిట్ పెట్టాలని మోడీ ప్రభుత్వం అంటోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రతినిధులతో చర్చలకు టెస్లా రెడీ అవుతోంది. గతంలో అమెరికా పర్యటన సమయంలో ప్రధాని మోడీ స్వయంగా టెస్లా ప్లాంట్‌ను
సందర్శించారు. అక్కడి తయారీ ప్లాంట్ విశేషాలను ఎలాన్ మాస్క్‌ను అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. దీంతో టెస్లా ఇండియా ఎంట్రీ లాంఛనమే అని అనుకున్నారు. టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశిస్తే... ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో సమూల మార్పులు వచ్చే అవకాశముందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు.