Cambodia: థాయ్‌, కాంబోడియా స‌రిహ‌ద్దుల్లో ఫైరింగ్‌.. మ‌ళ్లీ ఉద్రిక్త‌లు

వైమానిక దాడులు, ఒకరి మృతి!;

Update: 2025-07-24 05:45 GMT

థాయ్‌ల్యాండ్‌, కాంబోడియా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డ‌ర్ వ‌ద్ద ఫైరింగ్ జ‌రిపారు. ప్రాచీన ఆల‌యం ప్ర‌సాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. థాయ్‌ల్యాండ్‌లోని సురిన్ ప్రావిన్సులో ఈ ఆల‌యం ఉన్న‌ది. బోర్డ‌ర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో ఉద్రిక్త‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. గ‌త కొన్ని రోజులుగా బోర్డ‌ర్ వ‌ద్ద ఇలాంటి ప‌రిస్థితి ఉన్న‌ది. అయితే తాజా ఫైరింగ్‌తో మ‌ళ్లీ ప‌రిస్థితులు కొత్త ద‌శ‌కు చేరుకున్నాయి. ముందు మీరే కాల్పులు జ‌రిపారంటూ రెండు దేశాలు ఒక‌రిపై ఒక‌రు ఆరోపించుకుంటున్నాయి.

కాంబోడియాతో ఉన్న ఈశాన్య బోర్డ‌ర్‌ను ఇటీవ‌ల థాయ్‌ల్యాండ్ మూసివేసింది. త‌మ అంబాసిడ‌ర్‌ను వెన‌క్కి ర‌ప్పిస్తున్నామ‌ని, కాంబోడియా దౌత్య‌వేత్త‌ను పంపించేస్తున్నామ‌ని థాయ్ పేర్కొన్న‌ది. బోర్డ‌ర్ వ‌ద్ద జ‌రిగిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్‌లో థాయ్ సైనికులు గాయ‌ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా థాయ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో థాయ్‌ల్యాండ్‌తో దౌత్య‌ప‌ర‌మైన సంబంధాల‌ను తెంచుకుంటున్న‌ట్లు కాంబోడియా ప్ర‌క‌టించింది. బ్యాంగ్‌కాక్‌లో ఉన్న ఎంబ‌సీ సిబ్బందిని కూడా కాంబోడియా వెన‌క్కి ర‌ప్పించింది.

జూలై 16వ తేదీన పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న సైనికుడు.. ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో కాలు కోల్పోయిన‌ట్లు థాయ్ అధికారులు తెలిపారు. థాయ్‌ల్యాండ్‌లోని ఉబ‌న్ ర‌చ్చ‌తాని, కాంబోడియాలోని ప్రేహ వియ‌ర్ ప్రావిన్సు మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా వివాదం చెల‌రేగుతున్న‌ది.

Tags:    

Similar News