Oxford Word Of The Year: ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా రేజ్ బైట్
సోషల్ మీడియాలో కోపాన్ని, ఆగ్రహాన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ను సూచించే పదం
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం “రేజ్ బైట్” ను 2025 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఈ సంవత్సరం ఇంటర్నెట్‌లో ఇది ఎక్కువగా ఉపయోగించే పదంగా మారింది. ప్రతి సంవత్సరం భాషా ప్రపంచాన్ని ఆకర్షించే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) తన ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ ను ప్రకటించింది. 2025కు ఎంపికైన పదం రేజ్ బైట్. ఇది సోషల్ మీడియాలో కోపాన్ని, ఆగ్రహాన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ను సూచిస్తుంది. ఈ పదం ఎందుకు ఎంపికైంది? రేజ్ బైట్ అంటే ఏమిటి? ఆ వివరాలు మీకోసం.. ఆక్స్‌ఫర్డ్ ప్రకారం, రేజ్ బైట్ అంటే “ఆన్‌లైన్ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా కోపం లేదా ఆగ్రహాన్ని రేకెత్తించేలా రూపొందించడం – ఫ్రస్ట్రేటింగ్‌గా, ప్రావొకేటివ్‌గా లేదా అధికారికంగా ఉండేలా చేయడం.
ఇది సాధారణంగా వెబ్‌సైట్ ట్రాఫిక్ లేదా సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి పోస్ట్ చేస్తారు.” ఇంగ్లీష్‌లో ‘రేజ్’ (కోపం) + ‘బైట్’ (ఆకర్షించే ఆహారం లాంటిది) కలయిక. మీరు ఒక పోస్ట్ చూసి “అది ఏంట్రా!” అని కామెంట్ చేస్తున్నారా? అది రేజ్ బైట్ ఉదాహరణ!ఈ పదం 2002లో ఉపయోగించారట, కానీ 2025లో దాని వాడకం మూడు రెట్లు పెరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచవ్యాప్త పోల్‌లో 30,000 మందికి పైగా ఓట్ల ఆధారంగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (OUP) దీనిని అధికారికంగా ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా పేర్కొంది.
గత సంవత్సరం ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా “బ్రెయిన్ రాట్” అనే పదం ఎంపికైంది. ఇది ఉత్పాదకత లేని, ప్రజలను మానసికంగా అలసిపోయి, నిష్క్రియాత్మకంగా ఉంచే కంటెంట్ వినియోగాన్ని సూచిస్తుంది. బ్రెయిన్ రాట్ అనేది కంటెంట్ వినియోగం వల్ల కలిగే అలసటను వివరించడానికి ఉద్దేశించబడింది.
గత ఐదు సంవత్సరాలుగా ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్
2025: రేజ్ బైట్
2024: బ్రెయిన్ రాట్
2023: రిడ్జ్
2022: గోబ్లిన్ మోడ్
2021: వ్యాక్స్