Oxford High School: ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు మృతి

Oxford High School: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్లో 15 ఏళ్ల బాలుడు విద్యార్ధులపై కాల్పులు జరిపాడు..

Update: 2021-12-01 09:45 GMT

Oxford High School: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్లో 15 ఏళ్ల బాలుడు విద్యార్ధులపై కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో అనేక మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడగా, ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. బాలుడు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని పాఠశాలలోకి ఆయుధాలను తీసుకెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు.

15 ఏళ్ల బాలుడు మంగళవారం మిచిగాన్ హైస్కూల్‌కు తన తండ్రి కొన్ని రోజుల క్రితం కొనుగోలు చేసిన సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌‌ను తీసుకెళ్లాడు. దాంతో తన తోటి విద్యార్ధులపై కాల్పులు జరిపాడు, ముగ్గురు విద్యార్థులను హతమార్చాడు. కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

డెట్రాయిట్‌కు ఉత్తరాన 40 మైళ్ల (65 కిమీ) దూరంలో ఉన్న మిచిగాన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో మధ్యాహ్న సమయంలో రక్తపాతం జరిగింది. కాల్పుల మోతకు భయభ్రాంతులకు గురైన విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు పాఠశాల బయటకు పరుగులు తీశారు.

నిందితుడు మైనర్ కావడంతో అధికారులు అతడి పేరును బయటకు వెల్లడించలేదు. జువైనల్ డిటెన్షన్ సెంటర్‌లోని ప్రత్యేక సెల్‌లో అతడిని ఉంచారు. ఐదు నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ విధ్వంసంలో 15 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిగాయని చెప్పారు. బాలుడిని అరెస్టు చేసినప్పుడు తుపాకీలో ఇంకా ఏడు గుండ్లు మిగిలి ఉన్నాయని పోలీస్ అధికారి షెరీఫ్ చెప్పారు.

Tags:    

Similar News