Donald Trump: భార‌త్‌-పాక్ యుద్దాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..

11 ఫైట‌ర్ జెట్లు కూలిపోయాయి, భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని ప్రగల్భాలు.

Update: 2026-02-20 00:30 GMT

 భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. అయితే, కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

గ‌తేడాది మేలో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆపరేషన్ సిందూర్ చేప‌ట్టింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. దీంతో దాయాది దేశం ఉక్కిరి బిక్కిరి అయింది. పాక్ కూడా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడుల‌కు పాక్ పాల్ప‌డింది. కానీ భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేసింది.

దాదాపు నాలుగు రోజుల త‌ర్వాత పాక్-భార‌త్ మ‌ధ్య‌ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం జ‌రిగింది. అయితే ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రచారం జరిగింది. కానీ కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే ప‌లు మార్లు స్పష్టం చేసింది. కానీ ట్రంప్ మాత్రం నేనే అపాన‌ని గొప్ప‌లు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు మ‌రోసారి అదే పాట పాడారు.

"ఆ సమయంలో ఇరు దేశాల మ‌ధ్య యుద్దం తీవ్రంగా సాగుతోంది. విమానాలు కూలిపోతున్నాయి. భార‌త ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు, అలాగే పాక్ ప్రధాని కూడా తెలుసు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. యుద్ద విర‌మ‌ణ చేయ‌క‌పోతే మీ రెండు దేశాలతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను. మీ దేశాల నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం టారిఫ్ విధిస్తామ‌ని హెచ్చ‌రించాను. భారీగా నష్టపోతామని తెలియగానే రెండు దేశాలు వెన‌క్కి త‌గ్గాయి. ఈ స‌మ‌యంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు


Tags:    

Similar News